Reviewed By: Dr. Anusha Kushanapally at Ferty9 Fertility Clinic, Secunderabad, Warangal
పిల్లలు పుట్టబోతున్నారు అనే ఆత్రుత, మొదట్లో ఉండే సందేహాలు తెలుసుకోవటానికి ప్రెగ్నెన్సీ పరీక్ష చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చేసే ప్రెగ్నెన్సీ టెస్టులు ద్వారా గర్భం వచ్చిందా లేదా అని మాత్రమే తెలుస్తుంది. కానీ, బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్ష వల్ల, రక్తంలో ఉండే హెచ్‌సీజీ అనే హార్మోను ఎంత స్థాయి లో ఉందో కచ్చితంగా తెలుస్తుంది. దీని వల్ల గర్భం గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు.
సాధారణ పద్ధతులలా కాకుండా, బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్షలు, ఎదుగుతున్న మావి (ప్లాసెంటా) ఉత్పత్తి చేసే హార్మోన్‌ను కొలుస్తాయి. ఈ సమాచారం ఆధారంగా వైద్యులకు గర్భాన్ని గుర్తించడానికి మరియు, సంబంధిత సమస్యలను పరిష్కరించడం ద్వారా మహిళలకు వ్యక్తిగత చికిత్స అందించడానికి సహాయపడుతుంది.
బీటా హెచ్‌సీజీ పరీక్ష అంటే ఏమిటి?
బీటా-హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ (బీటా హెచ్‌సీజీ) అనేది రక్త పరీక్ష. ఇది రక్తంలో హెచ్‌సీజీ హార్మోన్ల స్థాయిని కొలుస్తుంది. రక్తంలో హెచ్‌సీజీ హార్మోన్ ఎంత మోతాదులో ఉందో కచ్చితమైన సంఖ్యను ఇది తెలియజేస్తుంది. అంతేకాదు, గర్భం యొక్క మొదటి వారాల్లో బీటా హెచ్‌సీజీ స్థాయి చాలా వేగంగా పెరుగుతుంది. బీటా హెచ్‌సీజీ పరీక్ష చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మావి ఎంత బాగా అభివృద్ధి చెందుతోంది మరియు హెచ్‌సీజీ హార్మోన్లను ఎంత ఉత్పత్తి చేస్తోంది అని కొలుస్తుంది. ఈ పరీక్ష వల్ల గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
బీటా హెచ్‌సీజీ పరీక్ష ఎలా పనిచేస్తుంది?
బీటా హెచ్‌సీజీ పరీక్షను ముఖ్యంగా రెండు రకాలుగా చేస్తారు: క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ (సంఖ్యల రూపంలో కొలవగలిగేది).
క్వాలిటేటివ్ హెచ్‌సీజీ పరీక్షలో, ఒక వ్యక్తి రక్తం లేదా మూత్రంలో హెచ్‌సీజీ హార్మోన్ ఎక్కువ ఉందో లేదో చూస్తారు.
రక్త పరీక్షలో, రక్తం తీసి హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ అనే హార్మోన్ ఉందో లేదో చూస్తారు. ఇది ఉంటే గర్భం ఉందని లేకపోతే, గర్భం లేదని అని సింపుల్‌గా చెబుతారు. రక్తంలో ఈ హెచ్‌సీజీ హార్మోన్ ఎక్కువ ఉంటే గర్భవతి అని అర్థం.
మూత్ర పరీక్షలో, వ్యక్తి యొక్క మూత్ర నమూనా ను ఇస్తారు. అందులో హెచ్‌సీజీ హార్మోన్ ఎక్కువ ఉంటే గర్భవతి అని, లేకపోతే కాదని తెలుస్తుంది. ఇంట్లో పరీక్ష చేసుకోవడానికి నెలసరి తప్పిన తర్వాత చేయటం మంచిది. ఒకవేళ రిజల్ట్ సరిగ్గా లేకపోతే, బీటా ప్రెగ్నెన్సీ పరీక్ష మళ్లీ చేయించుకోమని వైద్యులు చెబుతారు.
క్వాంటిటేటివ్ బీటా హెచ్‌సీజీ పరీక్షలో, రక్తంలోని హెచ్‌సీజీ హార్మోన్‌ను లీటరుకు ఎన్ని యూనిట్లు ఉందో లెక్కిస్తారు. ఈ రిపోర్ట్ చూసి, పిండం ఎంత వయస్సు ఉందో కూడా చెప్పవచ్చు.
బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్షను ఎప్పుడు, ఎందుకు చేస్తారు?
గుడ్డు విడుదలైన రెండు వారాల తర్వాత, అంటే నెలసరి తప్పిన తర్వాత ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. అప్పుడు పిండం గర్భాశయంలో స్థిరపడిన తర్వాత హెచ్‌సీజీ హార్మోన్ తగినంతగా పెరుగుతుంది, కాబట్టి కచ్చితమైన ఫలితం వస్తుంది. ఈ పరీక్షను చాలా విషయాల కోసం ఉపయోగిస్తారు. గర్భాన్ని నిర్ధారించడానికి, గర్భం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందో లేదో గుర్తించడానికి, అల్ట్రాసౌండ్ ద్వారా గర్భం ఏక్టోపిక్ ప్రేగ్నన్సీ (గర్భాశయం వెలుపల ఉందో లేదో) తెలుసుకోవడానికి మరియు పిండం యొక్క వయస్సును నిర్ధారించడానికి ఇది సహాయపడుతుంది.
బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్షను తొందరగా చేయించుకోకూడదు. ఎందుకంటే అప్పుడు హెచ్‌సీజీ హార్మోన్‌ను గుర్తించడం కష్టం అవుతుంది. అంతేకాకుండా, హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ రక్త పరీక్ష గర్భం దాల్చిన సుమారు 10 రోజుల తర్వాత ఫలితాలను చూపిస్తుంది. అయితే, మూత్ర పరీక్ష సానుకూల ఫలితాలను చూపించడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు.
బీటాహెచ్‌సీజీ గర్భధారణ పరీక్ష ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం!
గర్భం కోసం ఎదురు చూస్తునప్పుడు, ‘హెచ్‌సీజీ స్థాయి అంటే ఏమిటి?’ లేదా ‘తొలి దేశలో హెచ్‌సీజీ స్థాయిలను ఎలా పెంచవచ్చు?’ వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్ష గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. వైద్య రంగంలో లేని వ్యక్తులు కూడా బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్ష ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడం అవసరం. కాబట్టి, తక్కువ మరియు ఎక్కువ బీటా హెచ్‌సీజీ స్థాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరీక్ష ఫలితాల అర్థం:
గర్భం దాల్చిన సుమారు 2 వారాల తర్వాత చేసిన బీటా-హెచ్‌సీజీ స్థాయి 5 mIU/mL కంటే తక్కువగా ఉంటే, గర్భం లేదని అర్థం.
అలాగే, గర్భం దాల్చిన సుమారు 2 వారాల తర్వాత చేసిన బీటా-హెచ్‌సీజీ స్థాయి 25 mIU/mL కంటే ఎక్కువగా ఉంటే, గర్భం ఉందని అర్థం.
హెచ్‌సీజీ స్థాయి 6 మరియు 24 mIU/mL మధ్య ఉంటే, అది ఒక స్పష్టమైన ఫలితం కాదు. కాబట్టి, గర్భాన్ని నిర్ధారించడానికి బీటా హెచ్‌సీజీ స్థాయి పెరుగుతుందో లేదో చూడటానికి మళ్లీ పరీక్ష చేయించుకోమని వైద్యులు సూచిస్తారు.
బేస్‌లైన్ బీటా హెచ్‌సీజీ రిపోర్ట్‌లో హెచ్‌సీజీ స్థాయి 100 mIU/mL దాటితే, అది పాజిటివ్‌గా పరిగణించబడుతుంది. ఎక్కువ బీటా హెచ్‌సీజీ స్థాయి కవలలు లేదా ముగ్గురు పిల్లలు ఉండవచ్చని కూడా సూచిస్తుంది, దీనిని తర్వాత అల్ట్రాసౌండ్ ద్వారా నిర్ధారిస్తారు.
అససిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) లో బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్షల ప్రాముఖ్యత
ART అనేది వంధ్యత్వాన్ని నయం చేయడానికి చేసే వివిధ ప్రక్రియలను కలిగి ఉంటుంది. ARTలో సాధారణంగా చేసే పరీక్షల్లో బీటా-హెచ్‌సీజీ రక్త పరీక్ష ఒకటి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) సమయంలో పిండం బదిలీ చేసిన సుమారు రెండు వారాల తర్వాత, గర్భం వచ్చిందో లేదో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా, ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (PGT) అనేది పిండాలను గర్భాశయంలో ప్రవేశపెట్టే ముందు జన్యుపరమైన లోపాల కోసం పరీక్షిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పిండాలను గుర్తించడానికి మరియు కొన్ని రకాల రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
బీటా-హెచ్‌సీజీ పరీక్ష ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు
బీటా-హెచ్‌సీజీ పరీక్ష ఫలితాలను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం:
- పిండం స్థిరపడే సమయం: పరీక్షను చాలా ముందుగా చేస్తే, హెచ్‌సీజీ స్థాయిని గుర్తించడం కష్టం కావచ్చు.
- వైద్య పరిస్థితులు: ఇటీవలి గర్భస్రావాలు, కణితులు లేదా అండాశయ తిత్తులు మరియు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (పిండం గర్భాశయం వెలుపల పెరగడం), వంటివి బీటా హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్ష ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
- సంతానోత్పత్తి చికిత్సలు: బీటా-హెచ్‌సీజీ ఇంజెక్షన్లు, అండం విడుదల అవ్వటానికి ప్రేరేపించగలవు మరియు పరీక్ష ఫలితాలను మార్చగలవు.
- బహుళ గర్భాలు: కవలలు లేదా ముగ్గురు పిల్లలు గర్భంలో ఉంటే, సాధారణం కంటే ఎక్కువ బీటా-హెచ్‌సీజీ స్థాయిలు ఉంటాయి.
ఇతర ప్రభావిత అంశాలు:
- సాధారణం కంటే ఎక్కువ నీరు త్రాగటం.
- పరీక్ష స్ట్రిప్‌పై తక్కువ మోతాదులో మూత్రం పడటం.
- గడువు ముగిసిన లేదా తిరిగి ఉపయోగించిన పరీక్ష స్ట్రిప్ ను ఉపయోగించడం.
- ప్రస్తుతం తీసుకుంటున్న మందుల యొక్క దుష్ప్రభావాలు.
- గర్భం యొక్క కాలవ్యవధి.
బీటా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ల యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు
బీటా-హెచ్‌సీజీ పరీక్ష యొక్క ప్రయోజనాలు:
- ఇతర పరీక్షల కంటే ముందుగా, కొన్నిసార్లు అండం విడుదలైన వారం తర్వాత కూడా గర్భాన్ని గుర్తించగలదు.
- గర్భధారణ పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి వైద్యులకు సహాయపడుతుంది.
- అధిక ప్రమాదం ఉన్న గర్భాలలో, సమస్యలు లేదా గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని అంచనా వేయడానికి బీటా-హెచ్‌సీజీ స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించాలీ.
బీటా హెచ్‌సీజీ స్థాయి పరీక్ష యొక్క పరిమితులు:
- సున్నితత్వంలో తేడాలు: వివిధ బ్రాండ్లు/మోడళ్ల మధ్య తేడాల వల్ల, గందరగోళానికి లేదా తప్పుడు ఫలితానికి దారితీయవచ్చు.
- పరీక్ష సమయం: చాలా ముందుగా పరీక్షించడం వల్ల తప్పుడు ఫలితాలు రావచ్చు.
- నాన్- డియాగ్నోస్టిక్ నేచర్: పెరిగిన స్థాయిలు గర్భాన్ని సూచిస్తాయి, కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి పరిస్థితుల వల్ల కూడా సానుకూల ఫలితం చూపించవచ్చు.
మునుపటి వైద్య పరిస్థితులు బీటా-హెచ్‌సీజీ ప్రెగ్నెన్సీ పరీక్ష ఫలితాలను ప్రభావితం చేస్తాయి, దీని వలన కచ్చితమైన ఫలితం తెలుసుకోవటం కష్టం అవుతుంది.
ముగింపు:
మీరు బీటా-ప్రెగ్నెన్సీ పరీక్ష కోసం సిద్ధమవుతుంటే, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్‌లోని వైద్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. వ్యక్తిగత విధానానికి పేరుపొందిన ఫెర్టీ9, వంధ్యత్వం మరియు ఇతర గర్భ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న అనేక జంటలకు నమ్మకమైన భాగస్వామిగా ఉంది. వారి నైపుణ్యం మరియు మార్గదర్శకత్వం మీ జీవితంలోని ఈ ముఖ్యమైన దశలో మీకు అవసరమైన మద్దతు మరియు అవగాహనను అందిస్తాయి.