ఇంట్రా-యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) తరువాత సంభోగం సురక్షితమేనా?: లాభనష్టాలను తెలుసుకుందాం

ఇంట్రా-యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) చేసిన తరువాత రోజువారి పనులు ప్రారంభించటం మరియు సంభోగం గురించి చాలా మంది తమ డాక్టర్లను తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ చికిత్స విజయవంతం అవుతుందో లేదో అని కొందరు ఆందోళన  పడుతుంటే, కలయిక ద్వారా గర్భం దాల్చే అవకాశం మెరుగు పడుతుందో లేదో  అని మరి కొందరు ప్రశ్నిస్తుంటారు.

ఐయూఐ తరువాత జరిగే సంభోగం గురించి, దాని వల్ల జరిగే లాభాలు ఇంకా నష్టాలు మరియు గర్భధారణ కోసం ప్రయత్నించేవారు ఎటు వంటి ఫలితాలు ఆశించవచ్చు అనేవి వైద్య పరమైన ఆధారాలతో  ఈ సంపూర్ణ మార్గదర్శి వివరిస్తుంది.

ఐయూఐ విధానం గురించి తెలుసుకుందాం

ఇంట్రా-యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) అనేది సంతానోత్పత్తి చికిత్సలో ముఖ్యమైన పురోగతి సూచిస్తుంది. ఈ విధానం మరింత క్లిష్టమైన పద్ధతులకు సులువైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ చికిత్సలో, ప్రత్యేకంగా తయారు చేసిన వీర్యాన్ని గర్భధారణ పొందడానికి అనుకూలమైన సమయం లో నేరుగా గర్భాశయంలోకి పంపిస్తారు.

ఎన్నో సమన్వయమైన జాగ్రత్తలతో వివిధ దశల్లో నిర్వహించే ఐయూఐ ప్రక్రియ పూర్తి అయ్యే సరికి సాధారణంగా రెండు-మూడు వారాలు పడుతుంది. అసలు ప్రక్రియ మొదలు పెట్టే ముందు వైద్యులు సంతానోత్పత్తి పరీక్షలు నిర్వహించి, గర్భ ధారణకు సరైన సమయం తెలుసుకుంటారు.

అండం విడుదల పర్యవేక్షణ: అల్ట్రాసౌండ్ మరియు రక్త పరీక్షల ఆధారంగా అండం విడుదల అయ్యే సమయాన్ని నిర్ధారిస్తారు.

వీర్యం తయారీ: సేకరించిన వీర్యాన్ని ప్రత్యేక పద్ధతిలో కడిగి, వాటి నుంచి ఆరోగ్యకరమైన వీర్యకణాలను ఎంచుకుంటారు.

ఐయూఐ విధానం: తయారు అయిన వీర్యాన్ని, ఒక సన్నని, వంచదగిన కాథెటర్ (గొట్టం) ద్వారా  గర్భాశయం లోకి పంపిస్తారు.

చికిత్స తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కొంచం సేపు విశ్రాంతి తీసుకుంటూ రోజువారి పనులు చేసుకోవచ్చు. 

ఈ ప్రక్రియ కొన్ని నిమిషాల్లో చాలా త్వరగా మరియు సులభంగా పూర్తవుతుంది.

చాలా మంది, తక్కువ అసౌకర్యంతో మరియు ఎటువంటి మత్తు అవసరం లేకుండా ఈ ప్రక్రియని చేసుకుంటారు. ప్రత్యేకంగా రూపొందించిన గొట్టాన్ని ఉపయోగించి, ఆరోగ్యకరమైన వీర్యకణాలను వైద్యులు నేరుగా గర్భాశయం లోకి పంపిస్తారు. ఈ ప్రక్రియ వల్ల అండాన్ని చేరుకోవటానికి, వీర్యం ప్రయాణం చేయవలసిన దూరం బాగా తగ్గుతుంది.

ఇతర సంతానోత్పత్తి చికిత్సలతో పోలిస్తే, ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్దతి. సంక్లిష్టమైన వైద్య పరీక్షలు లేదా పొడిగించిన రికవరీ సమయం అవసరం లేకుండా సంతానోత్పత్తి క్లినిక్ వద్ద ఈ విధానాన్ని చేయవచ్చు. విజయవంతం అయ్యే అవకాశాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉన్నప్పటికీ, చాలా గర్భధారణ సమస్యలకు కారణం తెలియని సంతానలేమి మరియు పురుషులలో కొంతవరకు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం లాంటి సమస్యలకు, ఐయూఐ తరచుగా మొదటి ప్రయత్నంగా ఉంటుంది.

ఐయూఐ తరువాత సంభోగం చేయవచ్చా ?

వైద్యలు సాధారణంగా ఐయూఐ విధానాలను అనుసరించి సన్నిహిత సంబంధాలకు మద్దతు ఇచ్చినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. ఐయూఐ తరువాత లైంగిక సంపర్కాన్ని వైద్యులు తరచుగా సూచిస్తారు. దీని వలన గర్భం దాల్చటం విజయవంతం అయ్యే అవకాశాలు మెరుగు పడటంలో సహాయ పడుతుంది.

ఐయూఐ లో సంభోగం యొక్క పాత్ర

ఐయూఐ ప్రక్రియలో లైంగిక కార్యకలాపాలు సహాయక పాత్రను పోషిస్తాయి. ఐయూఐ యొక్క ఫలితాల ప్రభావాన్ని సంభోగం పెంచుతుందని వైద్య ఆధారాలు సూచిస్తున్నాయి. వీర్యం లో ఉండే సహజ ప్రోస్టాగ్లాండిన్లు (హార్మోన్లు) గర్భాశయ ముఖద్వారాన్ని మృదువు గా చేయటానికి సహాయ పడతాయి మరియు వీర్యం యొక్క కదలికను మెరుగుపర్చి, తద్వారా విజయవంతమైన ఫలదీకరణ  అవకాశాలు పెరుగుతాయి.

ఐయూఐ తరువాత సంభోగం యొక్క సంభావ్య ప్రయోజనాలు:

ఐయూఐ ప్రక్రియ తరువాత లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. చికిత్స విజయవంతం అవ్వటానికి దోహదం చేస్తాయి.

·       శారీరక ప్రయోజనాలు:

o   వీర్యం కదలికకు సహాయపడే గర్భాశయ సంకోచాలను ప్రోత్సహిస్తుంది

o   కటి ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది

o   ఐయూఐ ప్రక్రియకు అనుబంధంగా అదనపు వీర్యాన్ని అందిస్తుంది

·       మానసిక ప్రయోజనాలు:

o   ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది

o   భాగస్వాముల మద్య భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది

o   చికిత్స సమయం లో సాధారణ జీవితాన్ని కొనసాగించటానికి సహాయపడుతుంది

o   ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మెరుగుపరుస్తుంది.

లైంగిక సంబంధాల యొక్క సమయం చికిత్స నియమాలకి అనుగుణంగా ఉండాలి మరియు ఏదైనా అసౌకర్యం ఉంటే, వైద్య బృందానికి తెలియచేయాలి. ఈ సమతుల్య విధానం వల్ల, దంపతులు తమ సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తూనే ఐయూఐ ద్వారా విజయవంతమైన గర్భధారణకు అవకాశాలు పెంచుకోవటానికి సహాయపడుతుంది.

ఐయూఐ తరువాత సంభోగం వల్ల కలిగే నష్టాలు మరియు సమస్యలు

 ఐయూఐ ప్రక్రియ సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, ప్రక్రియ తరువాత సంభోగం వల్ల వచ్చే సంభావ్య నష్టాలను అర్ధం చేసుకోవడం వలన దంపతులు తమ సన్నిహిత కార్యకలాపాల గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోవటానికి సహాయపడుతుంది.

ఐయూఐ ప్రక్రియ జరిగిన 18-24 గంటల తరువాత లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన వచ్చు అని వైద్యులు సూచిస్తారు, దీని వలన ప్రక్రియ విజయవంతం అవ్వటానికి సహాయపడుతుంది.

ప్రక్రియ తరువాత కనీసం 24 గంటల పాటు బరువు లు ఎత్తటం మరియు శ్రమతో కూడిన శారీరక కార్యకలాపాలను జంటలను నివారించమని వైద్యులు సూచిస్తారు.

ఐయూఐ తరువాత ఏమని ఆశించవచ్చు

ప్రక్రియ జరిగిన వెంటనే, దంపతులు తమ సాధారణ రోజువారీ పనులను తిరిగి ప్రారంభించవచ్చు. ప్రక్రియ పూర్తి ఆయన మొదట్లో కొన్ని గంటల పాటు విశ్రాంతి అవసరం అయినప్పటికీ, పూర్తిగా మంచానికే పరిమితo కానవసరం లేదని వైద్యులు సిఫారసు చేస్తారు. ప్రక్రియ గదిలో, విధానం పూర్తి అయిన తరువాత, దంపతులు ఇంటికి వెళ్ళే ముందు, 15-30 నిమిషాల స్వల్ప విశ్రాంతి సమయాన్ని సాధారణంగా ఇస్తారు.

ఐయూఐ ప్రక్రియ తరువాత శరీరం లో సాధారణంగా కనిపించే మార్పులు:

·   రొమ్ములు మృదువుగా ఉండటం

·   తేలికపాటి ఉబ్బరం లేదా అసౌకర్యం

·   యోని ఉత్సర్గ లో మార్పులు

·   అప్పుడప్పుడు తల తిరగటం లేదా అలసట

రెండు వారాల వ్యవధి: ఐయూఐ ప్రక్రియ తరువాత సంభావ్య మార్పులు గమనించడానికి, మొదటి రెండు వారాలు చాలా కీలకo. దాదాపు 6-8 రోజుల తరువాత  కొంత మంది, ఇంప్లాంటేషన్  బ్లీడింగ్ (గర్భాశయంలో పిండం అతుక్కొనేటప్పుడు, కొద్దిగా రక్తస్రావం అవ్వటం) అనుభవించవచ్చు. అయినప్పటికీ, ఇది వ్యక్తుల ని బట్టి మారుతుంది. 10-14 రోజుల నాటికి, గర్భాన్ని నిర్ధారించడానికి బీటా hCG పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సిఫారసు చేస్తారు.

ఈ నిరీక్షణ కాలం లో, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం వల్ల గర్భం వచ్చే అవకాశాల కోసం సరైన పరిస్థితులు ఏర్పరుస్తుంది. ఇందులో పోషకమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మరియు మితమైన వ్యాయామం చేయడం వంటివి ఉంటాయి. ఆరోగ్య సంరక్షణ బృందం సూచించిన విధంగా ఏదైనా మందులు ఉంటే, వాటిని  దంపతులు కొనసాగించాలి.

గర్భ పరీక్ష చేసుకోవడానికి కనీసం 14 రోజులు వేచి ఉండాలని, ఎందుకంటే తొందరగా చేసే పరీక్షలో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ సమయం లో చేసే రక్త పరీక్షలు ఇంట్లో చేసకునే గర్భ పరీక్షల కంటే మరింత ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.

ముగింపు:

సంతానోత్పత్తి చికిత్స పొందుతున్న దంపతులకు ఐయూఐ ప్రక్రియ తరువాత నిర్వహించే లైంగిక కార్యకలాపాల గురించి సాధారణంగా ఆందోళన చెందుతుంటారు. ప్రక్రియ తరువాత సంభోగం సురక్షితం అయినప్పటికీ, దంపతులు సన్నిహిత సంబంధాన్నీ తిరిగి ప్రారంభించటానికి 12-24 గంటలు వేచి ఉండాలని వైద్య పరమైన ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ నిరీక్షణ కాలం సున్నితమైన గర్భాశయ వాతావరణాన్ని రక్షించడానికి మరియు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఐయూఐ తరువాత నిర్వహించే సన్నిహిత సంబంధాలు మేలు చేస్తాయని దంపతులు విశ్వసించవచ్చు. వీర్యం లో సహజంగా ఉండే  ప్రోస్టాగ్లాండీన్ లు మరియు కటి ప్రాంతానికి పెరిగిన రక్త ప్రవాహం, చికిత్స ప్రక్రియకు మద్దతు ఇస్తాయి. దంపతులు ఎల్లప్పుడూ వారి సంతానోత్పత్తి నిపుణుల నిర్దిష్ట మార్గదర్శకాలను పాటిస్తూ, ఏదైనా అసాధారణ లక్షణాలను లేదా అసౌకర్యాన్ని తెలియచేయాలి.


Smiling newborn baby wrapped in a colorful blanket

Your Dream of Parenthood Starts Here

Schedule a visit today

captcha3
Green shield icon with check mark symbolizing protection or verification

No need to worry, your data is 100% safe with us

Find Hope and Solutions for Infertility Problems

Visit Our Clinic

Frequently Asked Questions

We're Here
To Help

Still have Questions?

Speak to us Contact Us

ఐయూఐ తర్వాత జరిగే సంభోగం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా? plus icon

వైద్యుల సూచనలు పాటిస్తే, ఐయూఐ తర్వాత జరిగే సంభోగం సాధారణంగా సురక్షితమే. అయితే, ప్రక్రియ జరిగిన తర్వాత కనీసం 18-24 గంటలు వేచి ఉండాలి. ఇది గర్భాశయ ముఖద్వారం సరిగ్గా మూసుకోవడానికి మరియు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఈ సమయంలో కొద్దిగా రక్తపు మరకలు కనిపించడం సాధారణం, కానీ ఎక్కువ నొప్పి లేదా అసాధారణ లక్షణాలు ఉంటే వెంటనే మీ వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

ఐయూఐ తర్వాత సంభోగంలో తప్పనిసరిగా పాల్గొనాలా? plus icon

వైద్యులు తరచుగా జంటలను సాధారణ సన్నిహిత సంబంధాలను నిర్వహించమని ప్రోత్సహిస్తారు, ఎందుకంటే ఈ చర్య:

  • ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • ఇద్దరి మధ్య అనుబంధాన్ని నిలుపుతుంది.
  • ఫలదీకరణ కోసం అదనపు వీర్యాన్ని అందిస్తుంది.
  • చికిత్స విజయవంతం కావడానికి సహాయపడుతుంది.
ఐయూఐ తర్వాత సంభోగంలో పాల్గొంటే విజయావకాశాలు పెరుగుతాయా? plus icon

ఐయూఐ తర్వాత జరిగే సంభోగం వల్ల, గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీర్యం లో ఉండే సహజమైన ప్రోస్టాగ్లాండిన్ల వల్ల:

  • కటి ప్రాంతానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
  • ఉపయోగపడే గర్భాశయ సంకోచాలు కలుగుతాయి.
  • వీర్య కణాలు అండం వైపు కదలడానికి సహాయపడుతుంది.
  • గర్భాశయ ముఖద్వారం మెత్తబడుతుంది.

Still have Questions?

Speak to us Contact Us

Table of Contents

    Related Articles

    What Happens to Your Body After Failed IVF

    What Happens to Your Body After Failed IVF

    How Many Times Can You Do IVF in a Year?

    How Many Times Can You Do IVF in a Year?

    How is an IVF Child Different from a Normal Child?

    How is an IVF Child Different from a Normal Child?

    ×
    CAPTCHA Image

    No need to worry, your data is 100% safe with us!