IVF నొప్పి: ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సమయంలో మహిళలు ఏమి ఆశించవచ్చు

తల్లిదండ్రులు కావాలనే ఆశతో IVF చికిత్సను పరిశీలిస్తున్నారా? ఈ ప్రయాణంలో ఎదురయ్యే వివిధ దశల గురించి, ముఖ్యంగా ఇంజెక్షన్లు లేదా ఇతర ప్రక్రియల సమయంలో ఏదైనా నొప్పి లేదా అసౌకర్యం ఉంటుందా అని తెలుసుకోవడం సహజం. మీ ఆందోళనలను అర్థం చేసుకుంటూ, IVF చికిత్సలో నొప్పికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. గుర్తుంచుకోండి, ఈ ప్రక్రియ సాధారణంగా మీరు భయపడాల్సినంత బాధాకరమైనది కాదు.

IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది అనేక దశలను కలిగి ఉండే సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ దశలలో కొన్నింటికి ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. ప్రధానంగా, అండాశయాల స్టిమ్యులేషన్ (గుడ్లు పెరగడానికి) మరియు ట్రిగ్గర్ షాట్ (గుడ్లు విడుదలకు సిద్ధం చేయడానికి) సమయంలో ఇంజెక్షన్లు అవసరం. కొన్నిసార్లు, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత గర్భధారణకు మద్దతుగా కూడా ఇంజెక్షన్లు ఇవ్వబడతాయి.

ఇంజెక్షన్లు అవసరమయ్యే ప్రధాన దశలను వివరంగా తెలుసుకుందాం:

1. అండాశయాల స్టిమ్యులేషన్ (గుడ్లు పెరగడానికి): ఈ దశలో అండాశయాలను ఉత్తేజపరిచి, ఎక్కువ సంఖ్యలో గుడ్లు కలిగి ఉన్న ఫోలికల్స్ పెరిగేలా చేయడానికి మీకు సాధారణంగా రోజువారీ హార్మోన్ ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. ఇందులో ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH), లూటినైజింగ్ హార్మోన్ (LH) లేదా రెండింటినీ కలిపి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఈ ఇంజెక్షన్లు సుమారు 8 నుండి 14 రోజుల వరకు అవసరం అవుతాయి. మీ శరీరం యొక్క స్పందన ఆధారంగా ఈ సమయం మారవచ్చు.

2. ట్రిగ్గర్ షాట్: మీ అండాశయాలలో ఫోలికల్స్ (గుడ్లు ఉండే సంచులు) సరైన సైజుకు పెరిగిన తర్వాత, అందులోని గుడ్లు పూర్తిగా ఎదగడానికి మరియు వాటిని సురక్షితంగా బయటకు తీయడానికి (ఎగ్ రిట్రీవల్/ ఒవమ్ పికప్) సిద్ధం చేయడానికి మీకు ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇస్తారు. దీన్నే “ట్రిగ్గర్ షాట్” అంటారు. ఈ షాట్ ఇవ్వడానికి సరైన సమయం చాలా ముఖ్యం. ఎగ్ రిట్రీవల్ చేసే సమయానికి సుమారు 36 గంటల ముందు ఈ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది hCG లేదా GnRH అగోనిస్ట్ అనే మందు రూపంలో ఉంటుంది.

3. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత: ఎగ్ రిట్రీవల్ మరియు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలు పూర్తయిన తర్వాత, గర్భాశయ పొరను బలంగా ఉంచడానికి మరియు తొందరగా గర్భం నిలబడటానికి మద్దతుగా కొందరు మహిళలకు ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. వీటిని కండరాలలో లేదా చర్మం కింద ఇవ్వవచ్చు. రెండు పద్ధతులు గర్భ ధారణకు మద్దతు ఇస్తాయి.

IVF సమయంలో నొప్పితో భయపడాలా?

ఏదైనా వైద్య ప్రక్రియ సమయంలో నొప్పితో ఆందోళన చెందడం సహజమే, IVF కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే, చాలామంది మహిళలు IVF చికిత్సలో కలిగే అసౌకర్యం తాత్కాలికం మరియు నిర్వహించ దగినది అని భావిస్తారు. ఇంజెక్షన్లు అవసరమయ్యే ప్రతి దశలో నొప్పి ఎలా ఉండవచ్చో ఇక్కడ చూద్దాం:

  • అండాశయాల స్టిమ్యులేషన్ ఇంజెక్షన్లు: చర్మం కింద వేసే ఇంజెక్షన్లకు చాలా సన్నని, చిన్న సూదులు వాడతారు. కాబట్టి, చాలామంది మహిళలకు ఇది ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు అనిపించే, లేదా సూది లోపలికి వెళ్ళిన అనుభూతిలా మాత్రమే ఉంటుంది. కొందరిలో ఇంజెక్షన్ ఇచ్చిన చోట కొద్దిపాటి నొప్పి, వాపు లేదా కమిలినట్లుగా ఉండవచ్చు. బొడ్డు చుట్టూ లేదా తొడ వంటి వేర్వేరు చోట్ల ఇంజెక్షన్ సైట్‌లను మార్చడం వల్ల ఈ అసౌకర్యం తగ్గుతుంది. ఐస్ ప్యాక్‌లను ఉపయోగించడం కూడా సహాయపడుతుంది.
  • ట్రిగ్గర్ షాట్: ఇది సాధారణంగా ఒకే ఒక్క ఇంజెక్షన్. దీని అనుభూతి స్టిమ్యులేషన్ ఇంజెక్షన్ల మాదిరిగానే ఉంటుంది.
  • ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత ఇంజెక్షన్లు (ప్రొజెస్టెరాన్): కండరాలలో ఇచ్చే ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్లు కొద్దిగా నొప్పిగా ఉండవచ్చు. దీనికి ఉపయోగించే మందు చిక్కగా ఉండటం మరియు కండరంలోకి ఇవ్వడం వల్ల కొంచెం నొప్పి అనిపించినా, ఆ నొప్పి ఎక్కువసేపు ఉండదు. అదే సమయంలో, చర్మం కింద ఇచ్చే ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్లు సాధారణంగా తక్కువ నొప్పిని కలిగిస్తాయి.

IVF లో నొప్పి అనిపించగలిగే ఇతర దశలు

  • ఎగ్ రిట్రీవల్: ఈ ప్రక్రియ సెడేషన్ లేదా అనస్థీసియా పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి, గుడ్లను బయటకు తీసే సమయంలో మీకు ఎలాంటి నొప్పి అనిపించదు. ప్రక్రియ తర్వాత కొందరికి కొద్దిపాటి కడుపు నొప్పి, ఉబ్బరం లేదా స్పాటింగ్ ఉండవచ్చు. సాధారణ పెయిన్ రిలీవర్లు మరియు విశ్రాంతి తీసుకోవడం ద్వారా వీటిని నిర్వహించవచ్చు.
  • ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్: ఈ ప్రక్రియ సాధారణంగా చాలామంది మహిళలకు నొప్పి లేకుండానే ఉంటుంది. ఇది పాప్ స్మియర్ టెస్ట్ మాదిరిగానే ఉంటుంది. కెథెటర్ (సన్నని గొట్టం)ను గర్భాశయంలోకి పంపేటప్పుడు మీకు చిన్నపాటి అసౌకర్యం అనిపించవచ్చు.

IVF సమయంలో అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు

  • ఐస్ లేదా వేడి: ఇంజెక్షన్ ఇచ్చే చోట ముందుగా మరియు తర్వాత ఐస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఆ ప్రదేశం మొద్దుబారి నొప్పి తగ్గుతుంది మరియు వాపు తగ్గుతుంది. కొన్నిసార్లు వేడి ప్యాక్ కూడా నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • ఓవర్-ది-కౌంటర్ పెయిన్ రిలీఫ్: ఎగ్ రిట్రీవల్ తర్వాత కడుపు నొప్పి కోసం, మీ డాక్టర్ పారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి సాధారణ నొప్పి నివారిణ మందులు సిఫారసు చేయవచ్చు.
  • మీ క్లినిక్‌తో మాట్లాడండి: మీకు ఏ సమయంలోనైనా తీవ్రమైన నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే, వెంటనే మీ ఫెర్టిలిటీ క్లినిక్‌ను సంప్రదించండి. వారు మీకు సరైన సలహా మరియు మద్దతును అందించగలరు.

నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి సాంకేతిక పురోగతులు

IVF పద్ధతులు నిరంతరం మెరుగుపడుతున్నాయి. ఈ పురోగతులు విజయవంతమయ్యే అవకాశాలను పెంచడంతో పాటు, చికిత్స సమయంలో మహిళలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. అసౌకర్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన కొన్ని ముఖ్యమైన పురోగతులు ఇక్కడ ఉన్నాయి:

1. మెరుగుపరచబడిన ఇంజెక్షన్ టెక్నిక్స్ మరియు మందులు

  • చిన్న సూదులు: చర్మం కింద ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్లకు ఉపయోగించే సూదులు ఇప్పుడు మరింత సన్నగా, పొట్టిగా ఉంటున్నాయి. దీనివల్ల ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తగ్గుతుంది.
  • నీటి ఆధారిత మందులు: చాలా హార్మోన్ మందులు ఇప్పుడు నీటి ఆధారితమైనవి. ఇవి సాధారణంగా ఆయిల్ ఆధారిత మందుల కన్నా తక్కువ చికాకును కలిగిస్తాయి.
  • ప్రీఫిల్డ్ సిరంజ్‌లు మరియు ఆటో-ఇంజెక్టర్లు: ఇవి ఇంజెక్షన్లు తీసుకోవడాన్ని సులభతరం చేస్తాయి. ఆటో-ఇంజెక్టర్లు ప్రక్రియను మరింత త్వరగా, సులభంగా చేస్తాయి.
  • GnRH-సంబంధిత మందులు: ఈ మందులు గుడ్లు అకాలంగా విడుదల అవ్వడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. వీటికి సాధారణంగా తక్కువ రోజుల స్టిమ్యులేషన్ అవసరం అవుతుంది మరియు పాత పద్ధతులతో పోలిస్తే తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

2. ఎగ్ రిట్రీవల్ సమయంలో నొప్పి నిర్వహణ

  • తేలికపాటి అనస్థీసియా మరియు సెడేషన్: ఎగ్ రిట్రీవల్‌కు అనస్థీసియా అవసరం అయినప్పటికీ, డాక్టర్లు సాధారణంగా తేలికపాటి సెడేషన్ లేదా తక్కువ సమయం పనిచేసే అనస్థీసియాను ఉపయోగిస్తారు. ఇది ప్రక్రియ తర్వాత మగత లేదా వికారంగా అనిపించడాన్ని తగ్గిస్తుంది.
  • స్థానిక అనస్థీసియా: కొందరు మహిళలకు, తేలికపాటి సెడేషన్‌తో పాటు మందులు లోకల్ అనస్థీసియాను ఉపయోగించడం మంచి ఎంపిక.
  • రిట్రీవల్ తర్వాత నొప్పి నిర్వహణ: ఎగ్ రిట్రీవల్ (ఒవమ్ పిక్ అప్) తర్వాత నొప్పి నుండి ఉపశమనం కోసం డాక్టర్లు సులభమైన మార్గాలను సూచిస్తారు. వారు సాధారణంగా ఓవర్-ది-కౌంటర్ పెయిన్ రిలీవర్లు వాడమని మరియు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తారు.

3. అతి తక్కువ బాధాకరమైన ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్

  • మృదువైన మరియు సులువుగా వంగే కెథెటర్లు: ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ కోసం ఉపయోగించే కెథెటర్లు (సన్నని గొట్టాలు) చాలా మృదువుగా, సులువుగా వంగేలా ఉంటాయి. దీని రూపకల్పన గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) గుండా పంపేటప్పుడు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
  • అల్ట్రాసౌండ్ గైడెన్స్: ఎంబ్రియోను గర్భాశయంలో సరైన స్థలంలో ఖచ్చితంగా ఉంచడానికి రియల్ టైమ్ అల్ట్రాసౌండ్‌ను ఉపయోగించడం ప్రక్రియ సమయంలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

4. మొత్తం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి వ్యూహాలు

  • స్పష్టమైన సమాచారం మరియు మద్దతు: IVF లో ప్రతి దశ గురించి వివరమైన సమాచారం అందించడం ఆందోళన మరియు భయాన్ని తగ్గిస్తుంది. కౌన్సెలింగ్ సేవలు మరియు ఫెర్టిలిటీ నిపుణుల మద్దతు ప్రక్రియ అంతటా మానసిక మద్దతును అందిస్తాయి.
  • రిలాక్సేషన్ పద్ధతులు: లోతైన శ్వాస మరియు ధ్యానం వంటి పద్ధతులు మహిళలకు ఒత్తిడిని తగ్గించి మంచి అనుభూతిని పొందడంలో సహాయపడతాయి.
  • ఆహ్లాదకరమైన క్లినిక్ వాతావరణం: డాక్టర్లు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేస్తున్నారు. ఇది రోగులు మరింత సౌకర్యంగా భావించడానికి సహాయపడుతుంది.

IVF చికిత్స ప్రతి ఒక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి, మీకు ఎలాంటి సందేహాలున్నా, ముఖ్యంగా నొప్పి లేదా అసౌకర్యం గురించి ఏవైనా భయాలున్నా మీ డాక్టర్‌తో తప్పకుండా మాట్లాడండి. మీరు సౌకర్యంగా ఉండేలా వారు తమ పద్ధతులను మార్చవచ్చు. నొప్పి తగ్గడానికి చిట్కాలు ఇవ్వడంతో పాటు, మీకు ఉన్న ఇతర ఆందోళనలకు కూడా వారు సహాయం చేస్తారు.

ముగింపు

IVF చికిత్సలో ఇంజెక్షన్లు, కొంచెం అసౌకర్యం ఉంటాయి, కానీ సాధారణంగా ఎక్కువ నొప్పి ఉండదు. ఈ తాత్కాలిక ఇబ్బందిని చాలామంది మహిళలు క్లినిక్ సలహాలు తీసుకుంటూ, సొంతంగా జాగ్రత్తలు పాటిస్తూ సులువుగా భరించగలరు. బిడ్డ పుట్టడం వల్ల కలిగే గొప్ప ఆనందం, ఈ కొద్దిపాటి శారీరక ఇబ్బందులను మర్చిపోయేలా చేస్తుంది.


Smiling newborn baby wrapped in a colorful blanket

Your Dream of Parenthood Starts Here

Schedule a visit today

captcha3
Green shield icon with check mark symbolizing protection or verification

No need to worry, your data is 100% safe with us

Find Hope and Solutions for Infertility Problems

Visit Our Clinic

Table of Contents

    Related Articles

    Your Diet After IVF Transfer: Foods to Avoid for a Successful Pregnancy

    Your Diet After IVF Transfer: Foods to Avoid for a Successful Pregnancy

    What Happens to Your Body After Failed IVF

    What Happens to Your Body After Failed IVF

    How Many Times Can You Do IVF in a Year?

    How Many Times Can You Do IVF in a Year?

    ×
    CAPTCHA Image

    No need to worry, your data is 100% safe with us!