×
Fertility Assessment Package Fertility Assessment Package

No need to worry, your data is 100% safe with us!

phone icon phone icon hover 040 6901 6602
Menu arrow
బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ఐవీఎఫ్ (IVF) చికిత్సలో అత్యంత కీలకమైన మరియు చివరి దశ ‘ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్’ (Embryo Transfer). అంటే ల్యాబ్‌లో తయారైన embryoన్ని తల్లి గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం. ఈ ప్రక్రియ విజయవంతం అయితేనే గర్భం నిలుస్తుంది.

బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏమిటి?

సాధారణంగా enbryosను (పిండాలను) 3 నుండి 7 రోజులు ల్యాబ్‌లో పెంచుతారు. Embryo 5వ రోజుకు చేరుకున్నప్పుడు దానిని ‘బ్లాస్టోసిస్ట్’ (Blastocyst) అంటారు.

  • కొత్త టెక్నాలజీ వల్ల ఇప్పుడు embryoను 5 రోజుల పాటు ల్యాబ్‌లో పెంచడం సులభమైంది.
  • లాభం ఏంటి? 3 రోజుల పిండంతో పోలిస్తే… 5 రోజులు పెరిగిన బ్లాస్టోసిస్ట్ చాలా బలంగా ఉంటుంది. డాక్టర్లు వీటిలో అత్యంత ఆరోగ్యంగా ఉన్న పిండాన్ని ఎంచుకుని ట్రాన్స్‌ఫర్ చేస్తారు కాబట్టి, IVF సక్సెస్ అయ్యే అవకాశాలు (Implantation Success) చాలా ఎక్కువగా ఉంటాయి.

ట్రాన్స్‌ఫర్ తర్వాత జాగ్రత్తలు ఎందుకు ముఖ్యం?

Embryoన్ని (పిండాన్ని) గర్భంలోకి ప్రవేశపెట్టిన తర్వాత… గర్భం నిర్ధారణ (Pregnancy Test) చేసుకోవడానికి సుమారు 2 వారాలు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ రెండు వారాల సమయం చాలా కీలకం.

నిజానికి, గర్భం నిలవడం అనేది పూర్తిగా మనం తీసుకునే జాగ్రత్తల మీదే ఆధారపడి ఉండకపోవచ్చు (అది పిండం నాణ్యత మరియు గర్భాశయ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది). అయినప్పటికీ, మనం కొన్ని తప్పులు చేయకుండా, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల సక్సెస్ అయ్యే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ తర్వాత పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు:

ఈ సమయంలో మీరు శారీరకంగా మరియు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. డాక్టర్లు సూచించే ప్రధానమైన జాగ్రత్తలు ఇవే:

  1. పోషకాహారం తీసుకోండి (Eat a Healthy Diet): ఇంటి భోజనమే అమృతం. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్ మరియు బయట దొరికే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది embryo ఎదుగుదలకు సహాయపడుతుంది.
  2. తగినంత విశ్రాంతి మరియు నిద్ర (Rest and Sleep): మీ శరీరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వండి. రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. విశ్రాంతి అంటే రోజంతా మంచం మీదే ఉండమని కాదు, కానీ అలసిపోయే పనులు చేయకూడదు. మానసిక ప్రశాంతత చాలా అవసరం.
  3. మందులు క్రమం తప్పకుండా వాడాలి (Take Medication): మీ డాక్టర్ మీకు కొన్ని మందులు ఇస్తారు (ముఖ్యంగా ప్రొజెస్టెరాన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్). వీటిని ఒక్క పూట కూడా మర్చిపోకుండా వేసుకోవాలి. పిండం గర్భానికి గట్టిగా అతుక్కోవడానికి ఈ మందులు సహాయపడతాయి.
  4. వేడికి దూరంగా ఉండాలి (Stay Clear from Heat): శరీర ఉష్ణోగ్రత పెరిగే పనులు చేయకూడదు.
    • వేడి నీళ్ళతో స్నానం చేయడం (Hot baths), ఆవిరి స్నానాలు (Saunas) లేదా హీటింగ్ ప్యాడ్లు పొట్ట మీద పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. వేడి వల్ల embryo దెబ్బతినే ప్రమాదం ఉంది.
  5. రసాయనాలకు దూరంగా ఉండాలి (Avoid Toxins): మన ఇంట్లో వాడే కొన్ని వస్తువులలో హార్మోన్లను దెబ్బతీసే రసాయనాలు (Endocrine disruptors) ఉంటాయి.
    • ఘాటైన పెర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్, ప్లాస్టిక్ వస్తువుల వాడకం తగ్గించండి.
    • రసాయనాలు ఉండే క్లీనింగ్ ప్రొడక్ట్స్ వాడకండి. ఇవి మీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ తర్వాత చేయకూడని పనులు

Embryoన్ని గర్భంలోకి ప్రవేశపెట్టిన తర్వాత (Embryo Transfer), గర్భం నిలుస్తుందా లేదా అనేది చాలా వరకూ embryo (పిండం) నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఫలితం మారే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

1. శారీరక శ్రమ మరియు బెడ్ రెస్ట్ (Physical Activities) IVF మొదలైన కొత్తలో… ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత పూర్తిగా ‘బెడ్ రెస్ట్’ (Bed rest) తీసుకోవాలని చెప్పేవారు. కానీ, కొత్త పరిశోధనల ప్రకారం రోజంతా మంచం మీదే పడుకోవడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు ఏమీ పెరగవు.

  • ఏం చేయాలి? మీ రోజువారీ చిన్న చిన్న పనులు మామూలుగానే చేసుకోవచ్చు. రోజంతా కదలకుండా పడుకోవాల్సిన అవసరం లేదు.

2. బరువులు ఎత్తడం మరియు వ్యాయామాలు (Heavy Lifting & Workouts) సాధారణ పనులు చేసుకోవచ్చు కానీ… కఠినమైన వ్యాయామాలు అస్సలు చేయకూడదు.

  • జిమ్ చేయడం, ఏరోబిక్స్ లేదా బరువులు ఎత్తడం (Heavy lifting) వంటి పనులకు దూరంగా ఉండాలి.
  • మీ శరీరంపై ఒత్తిడి పడే పనులు చేయవద్దు. వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చా లేదా అనేది మీ డాక్టర్‌ని అడిగి తెలుసుకోండి.

3. ఆహారంలో తినకూడనివి (Avoid Certain Foods and Drinks) ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారం చాలా ముఖ్యం. గర్భధారణకు ఇబ్బంది కలిగించే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి:

  • కొవ్వు పదార్థాలు: నూనెలో వేయించినవి (Fried foods), చిప్స్, బయట దొరికే జంక్ ఫుడ్.
  • ప్రాసెస్డ్ ఫుడ్: నిల్వ ఉంచిన మాంసం, సాసేజ్లు.
  • పచ్చి ఆహారం: సగం ఉడికించిన గుడ్లు లేదా పచ్చి చేపలు (Raw seafood).
  • స్వీట్స్ & డ్రింక్స్: కేకులు, పేస్ట్రీలు, కూల్ డ్రింక్స్ మరియు సోడాలు.
  • కెఫిన్: కాఫీ, టీలు మరీ ఎక్కువగా తాగకూడదు.

4. ధూమపానం మరియు మద్యపానం (Avoid Smoking and Alcohol)

  • మద్యం (Alcohol): ఇది చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పిండం గర్భసంచికి అతుక్కోదు (Implantation failure). ఒకవేళ గర్భం వచ్చినా, బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
  • ధూమపానం (Smoking): స్మోకింగ్ చేయడం వల్ల గర్భసంచి లోపలి పొర (Endometrial thickness) పల్చబడిపోతుంది. దీనివల్ల గర్భం నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి.

5. మానసిక ఒత్తిడి (Avoid Excessive Stress) IVF చికిత్స తీసుకునేటప్పుడు టెన్షన్ పడటం సహజం. అయితే, మరీ ఎక్కువ ఆందోళన చెందడం (High stress) వల్ల శరీరంలో హార్మోన్లు మారిపోయి, గర్భం నిలవకపోవచ్చు.

  • సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ధ్యానం, పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం ద్వారా మనసును ఉల్లాసంగా ఉంచుకోండి.

6. మందులు మరియు సప్లిమెంట్స్ (Medications) డాక్టర్ మీకు రాసిచ్చిన మందులను (ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు.

  • అలాగే, డాక్టర్ సలహా లేకుండా సొంత వైద్యం చేసుకోవద్దు. తలనొప్పి, జలుబు వంటి వాటికి కూడా డాక్టర్‌ని అడిగే మందులు వేసుకోవాలి.

7. లైంగిక కలయిక (Avoid Sexual Intercourse) బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ జరిగిన వెంటనే భార్యాభర్తలు కలయికకు దూరంగా ఉండాలి.

  • ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు కలయిక వద్దు.
  • అలాగే టాంపాన్స్ (Tampons) వాడటం లేదా యోని లోపల ఏవైనా క్రీమ్స్ పెట్టడం చేయకూడదు. డాక్టర్ ఎప్పుడు ఓకే చెబితే అప్పుడే కలయిక మొదలుపెట్టాలి.

8. వేడి నీటి స్నానాలు (Avoid Hot Baths) మీ శరీర ఉష్ణోగ్రత పెరిగితే embryoకి ప్రమాదం.

  • వేడి నీటి టబ్బుల్లో పడుకోవడం, ఆవిరి స్నానాలు (Saunas) లేదా మరీ వేడి నీళ్లతో స్నానం చేయకూడదు.
  • కేవలం గోరువెచ్చని నీళ్లతో (Lukewarm water) మాత్రమే స్నానం చేయాలి.

9. వెజైనల్ డౌచింగ్ (Avoid Vaginal Douching) యోనిని లోపల శుభ్రం చేయడానికి నీళ్లను లేదా ఇతర ద్రవాలను ఫోర్స్‌గా కొట్టడం (Douching) చేయకూడదు.

  • ఇది యోనిలో ఉండే సహజ బ్యాక్టీరియాను చంపేస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. శరీరం తనంతట తాను శుభ్రం చేసుకుంటుంది, మీరు ప్రత్యేకంగా లోపల క్లీన్ చేయాల్సిన పనిలేదు.

ముగింపు

IVF ప్రయాణం కొంచెం కష్టంగా, ఒత్తిడితో కూడుకున్నదిగా అనిపించవచ్చు. కానీ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మంచి ఆహారం తీసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రెండు వారాలు (Two-week wait) ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.



Disclaimer: This blog is intended for general informational and educational purposes only and should not be considered a substitute for professional medical advice, diagnosis, or treatment. Every individual's fertility journey is unique, and treatment decisions should be made in consultation with a qualified fertility specialist. For personalized guidance, we encourage you to speak with an expert at Ferty9 Fertility Center.

This post was last updated on :  

2 Mar 2026
Smiling newborn baby wrapped in a colorful blanket

Your Dream of Parenthood Starts Here

Schedule a visit today

captcha3
Green shield icon with check mark symbolizing protection or verification

No need to worry, your data is 100% safe with us

Find Hope and Solutions for Infertility Problems

Visit Our Clinic

Frequently Asked Questions

We're Here
To Help

Still have Questions?

నేను నా సాధారణ పనులను ఎప్పుడు మొదలుపెట్టొచ్చు? plus icon

ట్రాన్స్‌ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం లేదు, కానీ మొదటి రెండు వారాలు (టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు) రిలాక్స్‌గా ఉండటం మంచిది. వంట చేసుకోవడం, నడవటం వంటి చిన్న పనులు చేసుకోవచ్చు కానీ బరువులు ఎత్తడం, పరిగెత్తడం వంటివి చేయకూడదు.

ట్రాన్స్‌ఫర్ తర్వాత ప్రయాణాలు (Travel) చేయవచ్చా? plus icon
గర్భం నిలవడానికి ప్రత్యేకంగా ఏదైనా చేయాలా? plus icon

గర్భం కచ్చితంగా నిలుస్తుందని గ్యారెంటీ ఇచ్చే పని ఏదీ లేదు. కానీ… మంచి పోషకాహారం తీసుకోవడం, టైంకి మందులు వేసుకోవడం (ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్), ఒత్తిడి లేకుండా ఉండటం మరియు వేడికి దూరంగా ఉండటం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది.

హెర్బల్ టీలు (Herbal Teas) తాగొచ్చా? plus icon
నేను కాలుష్యం లేదా రసాయనాలకు దూరంగా ఉండాలా? plus icon

Still have Questions?

Table of Contents

    Related Articles

    సంతానోత్పత్తిని పెంచే 17 ముఖ్యమైన ఆర్గానిక్ ఆహారాలు

    సంతానోత్పత్తిని పెంచే 17 ముఖ్యమైన ఆర్గానిక్ ఆహారాలు

    గర్భం త్వరగా రావడానికి యోగా: మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

    గర్భం త్వరగా రావడానికి యోగా: మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

    నాచురల్ ప్రెగ్నెన్సీపై లూబ్రికెంట్స్ ప్రభావం: మీరు తెలుసుకోవాల్సిన నిజాలు

    నాచురల్ ప్రెగ్నెన్సీపై లూబ్రికెంట్స్ ప్రభావం: మీరు తెలుసుకోవాల్సిన నిజాలు

    ×
    Fertility Assessment Package Fertility Assessment Package

    No need to worry, your data is 100% safe with us!