×
Fertility Assessment Package Fertility Assessment Package

No need to worry, your data is 100% safe with us!

phone icon phone icon hover 040 6901 6602
Menu arrow
పురుషులలో హార్మోన్ల అసమతుల్యత: కారణాలు, లక్షణాలు మరియు చికిత్సలు

హార్మోన్లు అంటే ఏమిటి? 

మన శరీరంలో హార్మోన్లు (hormoes) అంటే చిన్న చిన్న సందేశాలు తీసుకెళ్లే రసాయనాలు లాంటివి.

మన ఆరోగ్యం సరిగ్గా ఉండటానికి ఇవి చాలా ముఖ్యమైనవి.ఇవి రక్తం ద్వారా శరీరంలో ప్రయాణించి, కండరాలు, అవయవాలు, కణాలకు “ఏ పని ఎప్పుడు చేయాలి?” అని సూచనలు ఇస్తుంటాయి.

హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance) అంటే ఏమిటి? 

హార్మోన్ల సమస్యలు కేవలం ఆడవారికే కాదు, మగవారికి కూడా వస్తాయి. మన రక్తంలో హార్మోన్ల స్థాయిలు ఉండాల్సిన దానికంటే మరీ ఎక్కువగా ఉన్నా లేదా మరీ తక్కువగా ఉన్నా… దానిని “హార్మోన్ల అసమతుల్యత” అంటారు.

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ మగవారిలో శక్తి తగ్గడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి మార్పులు వస్తుంటాయి. ఇది వయసు ప్రభావం అని చాలామంది అనుకుంటారు. కానీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే… దీనికి అసలు కారణం “హార్మోన్ల లోపం” కావచ్చు. దీనివల్ల Metabolism, కండరాల బలం మరియు మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

మగవారి ఆరోగ్యంలో హార్మోన్ల పాత్ర 

పురుషుల ఆరోగ్యానికి, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ (Testosterone) వంటి హార్మోన్లు చాలా కీలకం. వీటి గురించి అవగాహన పెంచుకోవడం వల్ల, సమస్యను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

మగవారిలో ఉండే ముఖ్యమైన హార్మోన్లు – వాటి పనులు:

  1. టెస్టోస్టెరాన్: ఇది మగవారిలో ఉండే ప్రధానమైన సెక్స్ హార్మోన్. కండరాల పెరుగుదల, ఎముకల బలం, శరీరంలో వెంట్రుకల పెరుగుదల మరియు పునరుత్పత్తి వ్యవస్థ (Reproductive system) సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం.
  2. కార్టిసాల్: దీనిని ‘స్ట్రెస్ హార్మోన్’ అని కూడా అంటారు. ఇది మనకు ఒత్తిడి (Stress) కలిగినప్పుడు స్పందిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను, వాపును తగ్గించడంలో మరియు metabolismను నియంత్రించడంలో సహాయపడుతుంది.
  3. గ్రోత్ (Growth) హార్మోన్: శరీర పెరుగుదలకు, కొత్త కణాలు ఏర్పడడానికి మరియు మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారడానికి (Metabolism) ఇది అవసరం.
  4. థైరాయిడ్ హార్మోన్లు: మన శరీర బరువును, ఎనర్జీ లెవెల్స్ (శక్తి) ని నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
  5. FSH (ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్: వృషణాలలో వీర్య కణాల ఉత్పత్తిని (Sperm Production) పెంచడానికి ఈ హార్మోన్ సహాయపడుతుంది.
  6. LH (ల్యూటినైజింగ్ హార్మోన్): శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అయ్యేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తుంది.
  7. ఈస్ట్రోజెన్: సాధారణంగా ఇది ఆడవారి హార్మోన్ అని మనకు తెలుసు. కానీ, మగవారిలో కూడా ఇది తక్కువ మోతాదులో తయారవుతుంది. శరీరంలోని కొన్ని ముఖ్యమైన పనులకు ఇది అవసరం.

హార్మోన్ల లోపం వల్ల కనిపించే లక్షణాలు: మగవారిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే ఈ క్రింది లక్షణాలు కనిపించవచ్చు:

  • విపరీతమైన అలసట లేదా నీరసం.
  • మూడ్ స్వింగ్స్ (కారణం లేకుండా కోపం లేదా విసుగు రావడం).
  • కండరాల బలం తగ్గడం (Decreased muscle mass).
  • శృంగారంపై ఆసక్తి తగ్గడం (Low Libido).
  • నిద్రలేమి సమస్యలు.
  • మానసిక ఆందోళన మరియు శారీరక సామర్థ్యం తగ్గడం.

హార్మోన్ల ఆరోగ్యం బాగుంటేనే… మగవారి శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

పురుషుల ఆరోగ్యం: హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance) – పూర్తి వివరాలు

పురుషులలో హార్మోన్ల స్థాయిలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వయసు పెరగడం వల్ల మాత్రమే కాకుండా… తీవ్రమైన ఒత్తిడి (Stress), అనారోగ్యం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి లేదా వ్యాయామం లేకపోవడం వల్ల కూడా హార్మోన్ల సమస్యలు రావచ్చు.

మగవారిలో శారీరక పెరుగుదల, మానసిక ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సుకు హార్మోన్లు చాలా కీలకం. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిలు మారడం అనేది చాలా సాధారణం. ఈ హార్మోన్ల లోపం వల్ల శరీరంలో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి.

ప్రధానమైన హార్మోన్ల సమస్యలు ఇవే:

1. టెస్టోస్టెరాన్ తగ్గడం (Low Testosterone): మగవారి ఆరోగ్యానికి, జీవితకాలానికి’టెస్టోస్టెరాన్’ చాలా ముఖ్యం. శరీరం తగినంత టెస్టోస్టెరాన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని ‘హైపోగొనాడిజం’ అంటారు.

  • ఎందుకు ముఖ్యం: కండరాల బలానికి, ఎముకల గట్టిదనానికి ఇది అవసరం.
  • తగ్గితే ఏమవుతుంది: ఎముకలు బలహీనపడతాయి (Osteoporosis), శరీరంలో కొవ్వు పెరుగుతుంది.
  • లక్షణాలు: శృంగారంపై ఆసక్తి తగ్గడం (Low Libido), అంగస్తంభన సమస్యలు, వీర్య కణాల ఉత్పత్తి తగ్గడం, తీవ్రమైన అలసట, డిప్రెషన్ మరియు చిరాకు. దీనివల్ల సంతానలేమి సమస్యలు వస్తాయి.

2. ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం (High Estrogen): సాధారణంగా ఈస్ట్రోజెన్ అనేది ఆడవారి హార్మోన్, కానీ ఇది మగవారిలో కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్‌తో కలిసి పనిచేస్తుంది.

  • కారణాలు: కొన్ని రకాల మందులు వాడటం, లివర్ సమస్యలు లేదా జీవనశైలి లోపాలు.
  • లక్షణాలు: సంతానలేమి (Infertility), అంగస్తంభన లోపాలు మరియు పురుషులలో వక్షోజాలు పెరగడం (Breast development).

3. థైరాయిడ్ సమస్యలు (Thyroid Disorders): థైరాయిడ్ పనితీరు మారినప్పుడు రెండు రకాల సమస్యలు వస్తాయి:

  • హైపోథైరాయిడిజం (పనితీరు తగ్గడం): దీనివల్ల అలసట, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, చలిని తట్టుకోలేకపోవడం, జుట్టు రాలడం మరియు మూడ్ స్వింగ్స్ వస్తాయి.
  • హైపర్ థైరాయిడిజం (పనితీరు పెరగడం): దీనివల్ల బరువు వేగంగా తగ్గడం, ఆందోళన (Anxiety), గుండె దడ, ఎక్కువగా చెమట పట్టడం మరియు లైంగిక సమస్యలు వస్తాయి.
  • గమనిక: ఈ రెండు సమస్యలు కూడా వీర్య కణాల సంఖ్య మరియు నాణ్యతను దెబ్బతీస్తాయి.

4. కార్టిసాల్ అసమతుల్యత (Stress Hormone): దీనిని ‘స్ట్రెస్ హార్మోన్’ అంటారు. మనం ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు రక్తంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.

  • ప్రభావం: కార్టిసాల్ పెరిగితే… టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. దీనివల్ల వీర్య కణాల నాణ్యత, సంఖ్య తగ్గుతుంది.
  • లక్షణాలు: ఆందోళన, నిద్రలేమి, విపరీతమైన అలసట, బరువు పెరగడం (ముఖ్యంగా పొట్ట దగ్గర). ఇది అంగస్తంభన సమస్యలకు కూడా దారితీస్తుంది.

5. ప్రోలాక్టిన్ సమస్యలు (Prolactin Disorders): రక్తంలో ‘ప్రోలాక్టిన్’ అనే హార్మోన్ మోతాదు పెరగడాన్ని ‘హైపర్ ప్రోలాక్టినిమియా’ అంటారు.

  • ప్రభావం: ఇది పురుషుల సంతానలేమికి (Male Infertility) ఒక ముఖ్య కారణం.
  • లక్షణాలు: శృంగార కోరికలు తగ్గడం, అంగస్తంభన లోపాలు. రక్త పరీక్షలో ప్రోలాక్టిన్ స్థాయి 15 µg/L కంటే ఎక్కువగా ఉంటే చికిత్స అవసరం.

హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణాలు: మన శరీరంలోని ‘ఎండోక్రైన్ వ్యవస్థ’ (Endocrine System) హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది సరిగ్గా పనిచేయకపోవడానికి కారణాలు:

  • డయాబెటిస్ (టైప్ 1 & టైప్ 2)
  • థైరాయిడ్ సమస్యలు (హైపో లేదా హైపర్)
  • తీవ్రమైన మానసిక ఒత్తిడి (Stress)
  • పోషకాహార లోపం (Poor Nutrition)
  • ఊబకాయం లేదా అతిగా బరువు తగ్గడం (Anorexia)
  • ఎడ్రినల్ gland సమస్యలు

హార్మోన్ల లోపం – కనిపించే లక్షణాలు: మీలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే హార్మోన్ల సమస్య ఉండవచ్చు:

  • కారణం లేకుండా బరువు తగ్గడం లేదా పెరగడం.
  • అధికంగా చెమట పట్టడం.
  • నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తలనొప్పి.
  • చర్మం పొడిబారడం లేదా దద్దుర్లు రావడం.
  • బీపీ (Blood Pressure) మరియు గుండె వేగంలో మార్పులు.
  • తరచుగా మూత్ర విసర్జన, అతి దాహం.
  • ఎముకలు బలహీనపడటం.
  • శృంగారంపై ఆసక్తి పూర్తిగా తగ్గడం.
  • పురుషులలో రొమ్ము పరిమాణం పెరగడం (Gynecomastia).

సంతానోత్పత్తి (Fertility) పై ప్రభావం: హార్మోన్ల సమస్యలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు… పిల్లలు పుట్టే అవకాశాన్ని కూడా దెబ్బతీస్తాయి.

  • వీర్య కణాల సంఖ్య (Sperm Count) తగ్గడం.
  • కణాల కదలిక (Motility) మందగించడం.
  • వీర్య కణాల ఆకారం (Morphology) దెబ్బతినడం.

వ్యాధి నిర్ధారణ (Diagnosis): హార్మోన్ల సమస్యలను గుర్తించడానికి డాక్టర్లు ఈ పరీక్షలు చేస్తారు:

  1. రక్త పరీక్షలు (Blood Tests): టెస్టోస్టెరాన్, థైరాయిడ్, కార్టిసాల్ స్థాయిలను తెలుసుకోవడానికి ఇవి ప్రధానం.
  2. ఇతర పరీక్షలు: షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ పరీక్షలు, మూత్ర పరీక్షలు మరియు అవసరమైతే స్కానింగ్ చేయాల్సి ఉంటుంది.

మీకు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి. సరైన చికిత్సతో హార్మోన్ల అసమతుల్యతను సరిచేసుకోవచ్చు

హార్మోన్ల అసమతుల్యతకు చికిత్సా విధానాలు

హార్మోన్ల సమస్యకు గల కారణాన్ని బట్టి… చికిత్స మారుతూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి మార్పులు మరియు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) వంటి పద్ధతుల ద్వారా మగవారిలో వచ్చే హార్మోన్ల లోపాలను సరిచేయవచ్చు.

1. జీవనశైలిలో మార్పులు (Lifestyle Modifications) మగవారిలో హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి:

  • మంచి పోషకాహారం తీసుకోవడం మరియు రోజూ వ్యాయామం చేయడం.
  • సరిగ్గా నిద్రపోవడం మరియు మానసిక ఒత్తిడిని (Stress) తగ్గించుకోవడం.
  • మద్యపానం (Alcohol), ధూమపానం (Smoking) వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం.
  • ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటికి తగిన చికిత్స తీసుకోవడం.

2. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (Hormone Replacement Therapy – HRT) ఇది పురుషులలో హార్మోన్ల సమతుల్యతను, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ (Testosterone) స్థాయిలను పెంచడానికి చేసే వైద్య చికిత్స.

  • ప్రయోజనాలు: టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల వచ్చే అలసట, మానసిక ఆందోళన (Low mood) మరియు లైంగిక సమస్యలను (Sexual dysfunction) ఇది తగ్గిస్తుంది.

3. మందులు మరియు సప్లిమెంట్స్ కొన్ని రకాల సప్లిమెంట్స్ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి. అయితే, డాక్టర్ సలహా లేకుండా సొంతంగా ఎలాంటి మందులు వాడకూడదు. హార్మోన్ల అసమతుల్యతకు సహాయపడే కొన్ని సప్లిమెంట్స్:

  • విటమిన్ డి (Vitamin D)
  • జింక్ (Zinc)
  • ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్
  • బి విటమిన్లు

4. ప్రత్యామ్నాయ చికిత్సలు (Alternative Therapies) చాలామందికి యోగా (Yoga) చేయడం వల్ల హార్మోన్ల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

  • యోగా వల్ల శరీర బలం, Flexibilityమరియు బ్యాలెన్స్ పెరుగుతాయి.
  • బరువు తగ్గడానికి మరియు హార్మోన్లను నియంత్రించడానికి యోగా చాలా మంచిది.
  • ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం అనేది… పురుషుల పునరుత్పత్తి (Reproductive) ఆరోగ్యానికి మరియు జనరల్ హెల్త్‌కు చాలా ముఖ్యం.

పురుషులలో హార్మోన్ల అసమతుల్యతను నివారించడం ఎలా?

ఆరోగ్యకరమైన అలవాట్లతో హార్మోన్ల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు:

  • ఆహారం: Healthy fats, హోల్ (whole) ఫుడ్స్ మరియు Lean proteins ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్ల ఆరోగ్యం బాగుంటుంది.
  • వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం (strength ట్రైనింగ్ మరియు కార్డియో) చేయడం వల్ల హార్మోన్ల స్థాయిలు అదుపులో ఉంటాయి.
  • ఒత్తిడి నియంత్రణ: ధ్యానం (Meditation), మైండ్‌ఫుల్‌నెస్ వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనివల్ల కార్టిసాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
  • హెల్త్ చెకప్స్: క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ మరియు స్క్రీనింగ్స్ చేయించుకోవడం వల్ల, సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు.
  • అనారోగ్య సమస్యల నిర్వహణ: డయాబెటిస్, బిపి వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి.
  • దురలవాట్లకు దూరం: ధూమపానం మానేయాలి మరియు మద్యపానాన్ని పరిమితం చేయాలి.

ముగింపు

మన శరీరంలో అనేక రకాల పనులను హార్మోన్లు నియంత్రిస్తాయి. హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు (Imbalance), రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవడం మంచిది. మీ శరీరంలో లేదా మీ ఎనర్జీ లెవెల్స్‌లో ఏవైనా మార్పులు గమనించినట్లయితే, వెంటనే మీ డాక్టర్‌ను సంప్రదించండి. ఇది సమస్యను త్వరగా పరిష్కరించుకోవడానికి మొదటి మెట్టు.



Disclaimer: This blog is intended for general informational and educational purposes only and should not be considered a substitute for professional medical advice, diagnosis, or treatment. Every individual's fertility journey is unique, and treatment decisions should be made in consultation with a qualified fertility specialist. For personalized guidance, we encourage you to speak with an expert at Ferty9 Fertility Center.

This post was last updated on :  

24 Feb 2026
Smiling newborn baby wrapped in a colorful blanket

Your Dream of Parenthood Starts Here

Schedule a visit today

captcha3
Green shield icon with check mark symbolizing protection or verification

No need to worry, your data is 100% safe with us

Find Hope and Solutions for Infertility Problems

Visit Our Clinic

Table of Contents

    Related Articles

    బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ సక్సెస్ రేట్: డే 5 ఎంబ్రియో మరియు IVF ఫలితాల గురించి పూర్తి గైడ్

    బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ సక్సెస్ రేట్: డే 5 ఎంబ్రియో మరియు IVF ఫలితాల గురించి పూర్తి గైడ్

    పురుషులలో హార్మోన్ల అసమతుల్యత: కారణాలు, లక్షణాలు మరియు చికిత్సలు

    పురుషులలో హార్మోన్ల అసమతుల్యత: కారణాలు, లక్షణాలు మరియు చికిత్సలు

    ITP సమస్య ఉన్న మహిళల్లో IVF సక్సెస్ రేట్ పెంచుకోవడానికి చిట్కాలు

    ITP సమస్య ఉన్న మహిళల్లో IVF సక్సెస్ రేట్ పెంచుకోవడానికి చిట్కాలు

    ×
    Fertility Assessment Package Fertility Assessment Package

    No need to worry, your data is 100% safe with us!